యువకధానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న ‘కార్తికేయ’ చిత్రం నిర్మాణం ముగింపు దశలో ఉంది, ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. తొలిచిత్రమే ద్వి భాషా చిత్రంగా రూపొందించటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందు మొండేటి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక చిత్రంగా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. ఇటీవల విడుదల అయిన చిత్రం ఆడియో కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన లభించిందని నిర్మాత తెలిపారు. ఆగస్టు 1న చిత్రం విడుదల అయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలు జరుగు తున్నాయని ఆయన అన్నారు. కధానాయకుడు నిఖిల్ గత చిత్రాలకన్నా అధిక బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రం విజయం పై ఎంతో నమ్మకముందని నిర్మాత తెలిపారు.


