హీరో కార్తికేయ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తోన్న కొత్త చిత్రం ’90ఎంఎల్’. కాగా తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా టాకీ పార్ట్ తో పాటు పాటల చిత్రీకరణ కూడా మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాను నవంబర్ చివరి వారంలో గాని, లేదా డిసెంబర్ మొదటివారంలో గాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. జేబులో ఎప్పుడు లిక్కర్ బాటిల్ మైంటైన్ చేసే డ్రింకర్ లవర్ గా కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నాడు.
కాగా ఈ చిత్ర ట్యాగ్ కూడా యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్ అని ఉండటం ఆసక్తి రేపుతుంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ సరసన హీరోయిన్ గా నేహా సోలంకి చేస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ, పోసాని, రావు రమేష్, అజయ్, రవి కిషన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.


