50రోజుల దిశగా పయనమవుతున్న కార్తికేయ

50రోజుల దిశగా పయనమవుతున్న కార్తికేయ

Published on Dec 6, 2014 12:05 PM IST

karthikeya
ఈ కాలంలో పెద్ద చిత్రాలు సైతం నాలుగు వారాలకు మించి ఆడలేకపోతున్న తరుణంలో ‘కార్తికేయ’ సినిమా 7వ వారంలోకి విజయవంతంగా ప్రవేశించింది. 50రోజుల పండుగను త్వరలో జరుపుకోవడానికి సిద్ధపడుతుంది. ఎన్నో అవాంతరాలను ఎదుర్కుని అక్టోబర్ 24న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలకు లాభాలని తెచ్చిపెట్టింది

చందూ మొందేటి తొలిసారి దర్శకత్వంలోనే విజయం సాధించాడు. ‘స్వామి రారా’ సినిమా తరువాత నిఖిల్, స్వాతి మరోసారి జతకట్టారు. మ్యాగ్నస్ సినీ ప్రైమ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మించారు

తాజా వార్తలు