రీ ఎడిటింగ్ ‘బ్యాడ్ బాయ్’ కార్తీకి హెల్ప్ అవుతుందా?

రీ ఎడిటింగ్ ‘బ్యాడ్ బాయ్’ కార్తీకి హెల్ప్ అవుతుందా?

Published on Mar 21, 2013 8:15 AM IST

Karthi-Bad-Boy-Movie-Poster
తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన ‘బ్యాడ్ బాయ్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 22న విడుదలకు సిద్దమవుతోంది. ‘సంక్రాంతి కానుకగా తమిళ్ లో వచ్చిన ‘అలెక్స్ పాండ్యన్’ సినిమాకి ఇది రీమేక్. మేము విన్న సమాచారం ప్రకారం తమిళ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు వెర్షన్ ని మరింత ఆసక్తికరంగా తయారుచేయడం కోసం 20 నిమిషాల సినిమాని కత్తిరించారు. అలా కత్తిరించిన తర్వాత సినిమా ఇంకా బాగుందని అంటున్నారు.

అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజ నిర్మించిన ఈ సినిమాకి సురాజ్ డైరెక్టర్. ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్లో బాగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

‘బ్యాడ్ బాయ్’ కి రీ ఎడిటింగ్ ఆంధ్రప్రదేశ్లో హెల్ప్ అవుతుందా? అంటే మరొక్క రోజు వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు