కార్తి ‘ఖైదీ’ విడుదల తేదీ ఖరారు !

కార్తి ‘ఖైదీ’ విడుదల తేదీ ఖరారు !

Published on Aug 27, 2019 6:25 PM IST

తమిళ స్టార్ హీరో కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ’. కాగా తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 26 న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదట.

డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ డిఫరెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక కార్తి ఈ సినిమాతో దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు