‘కార్తికేయ – 2 ‘కి శృతి శర్మనే ఫిక్స్ అయిందట !

‘కార్తికేయ – 2 ‘కి శృతి శర్మనే ఫిక్స్ అయిందట !

Published on Aug 29, 2019 2:05 AM IST

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నిఖిల్ సరసన హీరోయిన్ గా శృతి శర్మనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుర్తయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు