ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ తో కార్తికేయ తదుపరి చిత్రం

ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ తో కార్తికేయ తదుపరి చిత్రం

Published on Apr 12, 2024 12:36 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగానే కాకుండా సాలిడ్ విలన్ రోల్స్ లో కూడా మెప్పించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడ పలు చిత్రాలు చేసిన ఈ మ్యాచో మ్యాన్ గత ఏడాదిలో “బెదురులంక 2012” లో మంచి హిట్ అందుకోగా ఇప్పుడు తన తదుపరి సినిమాని రివీల్ చేసాడు.

దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మేకర్స్ “భజే వాయు వేగం” అనే ఆసక్తికర టైటిల్ ని రివీల్ చేయడమే కాకుండా కార్తికేయ పై సాలిడ్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేత రిలీజ్ చేశారు. ఇందులో తను బ్యాట్ పట్టుకొని మంచి యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే కింద ఎగురుతున్న డబ్బు నోట్లు కనిపిస్తున్నాయి.

వీటితో పాటుగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. వీటన్నిటితో మంచి రేసీ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్స్ మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రధన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ చిత్రం రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు