నమ్మకం కోల్పోని కార్తికేయ.. రెట్టించిన ఉత్సాహంతో

నమ్మకం కోల్పోని కార్తికేయ.. రెట్టించిన ఉత్సాహంతో

Published on Apr 3, 2021 3:00 AM IST

Karthikeya

యంగ్ హీరో కార్తికేయ ఇప్పుడిప్పుడే హీరోగా కుదురుకుంటున్నాడు. చేసిన ఏడు సినిమాల్లో ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాగా ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నెగెటివ్ రోల్ చేసి మెప్పించాడు. ఇటీవల ఆయన్నుండి వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం బాక్సాఫీస్ ముందు పరాజయం చెందింది. ఈ సినిమా మీద ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకోగా నిరాశకు గురయ్యారు. ఇక కార్తికేయ అయితే చిత్రాన్ని చాలా నమ్మాడు కెరీర్లో డిఫరెంట్ మూవీ అవుతుందని ఆశపడ్డాడు. కానీ రిజల్ట్ రివర్స్ అయింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో కార్తికేయ నేరుగా వారికి వివరణ ఇచ్చుకున్నాడు.

అయితే ఫ్లాప్ ఎదురైంది కదా అని కార్తికేయ నిరుత్సాహపడలేదు. రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నాడు. వెంటనే కొత్త సినిమాకు సిద్దమయ్యాడు. ఈసారి కూడ కొత్త దర్శకుడే. ఇందులో నెవర్ బిఫోర్ లుక్ ట్రై చేస్తున్నానని, ఈ కొత్త బృందాన్ని గట్టిగా నమ్ముతున్నానని, గట్టి ఇంపాక్ట్ ఇస్తామని, రేపే సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ చెబుతానని అన్నారు. మరి కార్తికేయ ఇంత ధీమాగా చెబుతున్న ఆ సినిమా ఏంటి అనేది తెలియాలంటే రేపు సాయంత్రం 4:05 గంటల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు