
రొటీన్ సినిమాలు చేసి వరుస పరాజయాలతో ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈసారి జాగ్రత్తపడి చేస్తున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. సీనియర్ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
ఎలాంటి డైలాగ్స్ లేకుండా ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ ల మధ్య జరిగే కేవలం ఒకే ఒక్క చిన్నపాటి రొమాంటిక్ సన్నివేశం కలిగిన ఈ టీజర్ చూస్తే కరుణాకరన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాక సినిమా మొత్తం ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఉంటుందనే నమ్మకం కూడ కలుగుతోంది.
ఈ నమ్మకం నిజమై టీజర్లో ఉన్నట్టే సినిమా మొత్తం కరుణాకరన్ రొమాంటిక్ ట్రీట్మెంట్ కనబడితే సినిమా విజయవంతమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం పారిస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ వేసవి తరవాత విడుదలకానుంది.