నేటి నుండే సరికొత్త ధారావాహిక ‘కస్తూరి’ !

Published on Sep 21, 2020 2:37 pm IST

బుల్లితెర పై వచ్చే సీరియళ్లల్లో కొన్ని తెలుగు జీవితాల్లో ఒక భాగం అయిపోతుంటాయి. తరాలు మారుతున్నా సరే… ఒక గొప్ప సీరియల్ కి ప్రేక్షకుల హృదయాల్లో ఉండే స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు. నిత్యనూతనంగా అందరి మనసుల్నీ దోచుకునే అలాంటి గొప్ప సీరియల్ ఈ మధ్య కాలంలో రావడం లేదనే వెలితి, నేటితో తీరనుంది. సరికొత్త ధారావాహిక ‘కస్తూరి’ ఈ రోజు నుండి రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రారంభం కానుంది. ఓ అద్భుత సీరియల్ గా మొదలుకానున్న ఈ సీరియల్ రెగ్యులర్ సీరియల్స్ లా ఉండదట.

రెగ్యులర్ సీరియల్ కు మల్లె ఎపిసోడ్ లు నింపడానికో, టీఆర్పీ రేటింగ్ కోసమే తెరకెక్కుతాయి. మనిషిలోని భావాలను బంధాలను పట్టుకుని హృదయాన్నికదిలించే సీరియళ్లు అతి తక్కువుగా వస్తుంటాయి. అలాంటి సీరియల్స్ అంటే ఆడవాళ్లకు మహా పిచ్చి. అసలు సీరియల్ పిచ్చి లేని ఆడవాళ్లు ఎవరు ఉండరు ఏమో. అలాంటి వారందరీ కోసం ఈ ‘కస్తూరి’ వస్తోంది. ఎప్పుడూ టీవీలో సీరియల్స్ పెట్టుకొని చూసే ప్రేక్షకులు ఇప్పటికే ‘కస్తూరి’ సీరియల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు ఈ సీరియల్ కి ఫ్యాన్స్ అయిపోతారనే విధంగా ఉంటుందట ఈ సీరియల్. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఇలాంటి సీరియల్ ఈ మధ్య కాలంలో రాలేదట. ఇక ఈ సీరియల్ ను ఫ్లయింగ్ ఈగిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. దర్శకుడు ఆర్ కె మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎన్ స్వామి నిర్మాతగా ఐశ్వర్య హీరోయిన్ గా నాగార్జున హీరోగా ఈ సీరియల్ రానుంది. ఇక లీడ్ క్యారెక్టర్స్ గా సూర్య, వాసుదేవ్, మీనా, వర్ష, వీణ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More