బాలకృష్ణ ప్రధాన పాత్రగా .. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు బాలకృష్ణ డబ్బింగ్ చెప్పారు. కాగా తాజాగా ఇతర తారాగణం కూడా తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెబుతున్నారు. రానా కూడా ఈ వారంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారట.
ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
