‘కత్తి’ సినిమాలో 20 నిముషాలు కోత.

‘కత్తి’ సినిమాలో 20 నిముషాలు కోత.

Published on Nov 10, 2014 3:39 PM IST

kathi
తమిళంలో ఇటివలే విడుదలై ఘనవిజయం సాధించిన ‘కత్తి’ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఠాగూర్ మధు డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ వర్క్స్ జరుగుతుంది.

నవంబర్ 21న లేదా 28న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. అలాగే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాను 20 నిముషాలు ట్రిమ్ చేస్తున్నట్టు చెప్పారు. 2.46 గంటల తమిళ సినిమాను తెలుగులో 2.26 గంటలకు కుదించారు.

ఇళయ దళపతి విజయ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. అనిరుధ్ సంగీతం అందించారు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు