బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్..!

Published on Mar 14, 2022 10:40 pm IST


బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్ కార్యక్రమం అప్పుడే రెండు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా, రెండో వారం శ్రీరాపాక ఎలిమినేట్‌ అయ్యారు. అయితే తాజాగా బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షోపై రెగ్యులర్ బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బిగ్‌బాస్‌ షోలో ఎవరు గెలుస్తారన్న విషయంలో నా అంచనాలు ఎప్పుడూ తప్పుకాలేదని.. అయితే ఈసారి బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌లో బిందుమాధవి విజేతగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ ఓటీటీకి సంబంధించి కొన్ని ప్రోమోలు చూశానని, వాటిలో బిందుమాధవి యాటిట్యూడ్‌, సామర్థ్యాలు చూశాక తనే గెలుస్తుందని అనిపించిందని అన్నారు. ఇకపోతే వారియర్స్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన కొందరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ తడబడుతున్నారని, వారిని చూస్తే నవ్వు వస్తుందని అన్నాడు. మరి కౌశల్‌ చెప్పినట్టు నిజంగానే బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌గా బిందుమాధవి నిలుస్తుందా? లేదా? అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :