ఆ యువ హీరో సినిమా విడుదల ఆలస్యం కానుందా ?

ఆ యువ హీరో సినిమా విడుదల ఆలస్యం కానుందా ?

Published on Nov 25, 2018 12:40 PM IST

యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 5వ చిత్రం ‘కవచం’ డిసెంబర్ 7న విడుదలవుతుందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చిత్ర వర్గాల నుండి వస్తున్నతాజా సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదల వాయిదా పడనుందట. అయితే ఈవాయిదా పడడానికి గల కారణం తెలియాల్సి వుంది. ఇక అలాగే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ద్రువీకరించాల్సి వుంది.

నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా కాజల్ , మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు