25కోట్ల క్లబ్ లో చేరిన నివిన్ పౌలీ చిత్రం !

Konchunu

మలయాళ యువ సెన్సేషన్ నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం ‘కాయంకులం కొచ్చుణ్ణి’ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మలయాళం మార్కెట్ పరంగా చూసుకుంటే మూడు రోజులకు ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం గొప్ప విషయమే. ఇక ఈచిత్రం అటు యూఏఈ లో రూ. 6.56 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ ఏడాది సౌత్ ఇండియా చిత్రాల్లో అక్కడ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన చిత్రంలో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈచిత్రంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. శ్రీ గోకుల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది.

Exit mobile version