టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘అనకాపల్లి’ !

ANAKAPALLI

విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనకాపల్లి’. ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ విడుద‌ల అయింది. ఈ టీజ‌ర్ చాలా బాగా ఆకట్టుకుంది. ఒక ఇంటెన్స్ పల్లెటూరి యాక్షన్ డ్రామాను ఈ టీజర్ లో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. విక్రమ్ సాహిదేవ్ తన సరికొత్త లుక్ మరియు పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. అలాగే, విక్రమ్‌తో పాటు సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో కనిపించారు.

దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. నక్కిన నరేటివ్స్ మరియు భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ టీజర్ కి డావ్‌జాండ్ సంగీతాన్ని అందించారు. టీజర్ చివర్లో మేకర్స్ ప్రకటించినట్లుగా ఈ మూవీని ‘సమ్మర్ 2026’ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version