టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు శ్రీ విష్ణు ఇటీవల మృత్యుంజయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హుస్సేన్ షా కిరణ్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఇప్పుడు తన డిజిటల్ విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
నెట్ఫ్లిక్స్ యాప్లో వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, మృత్యుంజయ్ చిత్రం ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయిన ఈ సినిమాకు, ఓటీటీ ద్వారా మంచి ఆదరణ లభించే అవకాశముంది.
ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ కథానాయికగా నటించగా, వీర్ ఆర్యన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. బేబీ ఉహా, సుదర్శన్, అయ్యప్ప శర్మ, రచ్చ రవి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, కాల భైరవ సంగీతాన్ని అందించారు.
