నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మహానటి. నిన్న నుండి ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో ప్రారంభం అయ్యాయి. కీర్తి సురేష్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తోంది.
సమంత, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాను మే 9న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మర్చి లోనే సినిమా విడుదల కావాలి కాని షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా కొద్దిగా ఆలస్యం అయ్యింది. హాలివుడ్ కెమెరామెన్ దని సంచిజ్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.


