సూపర్ స్టార్ తో మహానటి ?

Published on Dec 20, 2018 8:50 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పెట్టా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత రజినీ, మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ఈచిత్రంలో రజినీ కి జోడిగా కీర్తి సురేష్ ను తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం కీర్తి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఒక వేళా ఆమె ఈ సినిమా ఒప్పుకుంటే ఆమె కెరీర్ కు చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ వుంది. ఇంతకుముందు కీర్తి మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ అనే చిత్రంలో నటించింది. ఇక మహానటి చిత్రం తరువాత ఇంతవరుకు తెలుగు లో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు కీర్తి సురేష్.

సంబంధిత సమాచారం :