నానితో రెండవసారి నటించనున్న స్టార్ హీరోయిన్ ?

నానితో రెండవసారి నటించనున్న స్టార్ హీరోయిన్ ?

Published on Jun 24, 2018 7:24 PM IST


‘మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో నాని’ జెర్సీ ‘అనే చిత్రంలో నటించనున్నాడని అని తెలిసిందే . ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనుంది ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక నాని మొదటసారి క్రికెటర్ గా నటించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారా దర్శక నిర్మాతలు

ఇంతకు ముందు నాని , కీర్తి కలిసి నటించిన ‘నేను లోకల్ ‘మంచి విజయం సాధించింది . ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది దాంతో జెర్సీ చిత్రానికి మళ్ళి ఈ జంటనే రిపీట్ చేయనున్నారని సమాచారం . ఇక నాని ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నటించనున్నాడు . ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు .

ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టి స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమాతో పాటు అయన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ తమిళ్ లో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ గా వుంది .మహానటి సినిమా తరువాత ప్రస్తుతానికి ఆమె తెలుగులో ఏ చిత్రంలో నటించట్లేదు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు