“లోకేష్ సినిమాటిక్ యూనివర్స్” షార్ట్ ఫిల్మ్ డీటైల్స్ ఇవే!

“లోకేష్ సినిమాటిక్ యూనివర్స్” షార్ట్ ఫిల్మ్ డీటైల్స్ ఇవే!

Published on May 18, 2024 6:52 AM IST


కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) తో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఖైదీ, విక్రమ్ మరియు లియో ఈ యూనివర్స్ కిందకు వస్తాయి. ఇవన్నీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. కొన్ని నెలల క్రితమే LCU మూలాన్ని వివరిస్తూ లోకేష్ ఒక షార్ట్ ఫిల్మ్ తీయనున్నాడని వెల్లడించారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ షార్ట్ ఫిల్మ్‌కి పిళ్లైయార్ సుజి (ది బిగినింగ్) అని పేరు పెట్టారు. లోకేష్ ఇప్పటికే ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌ను ముగించారు.

ఈ షార్ట్ ఫిల్మ్ అతి త్వరలో ఆడియెన్స్ కి అందుబాటులోకి రానుంది. దాని గురించి ప్రెస్ మీట్ మే 20న జరిగే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తి చేయడానికి లోకేష్ కి కేవలం 20 రోజులు పట్టినట్లు చెబుతున్నారు. అర్జున్ దాస్, నరేన్, కాళిదాస్ జయరామ్ ఇతర నటీనటులు ఈ షార్ట్ ఫిల్మ్‌లో భాగం అయినట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్‌ను OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తారా లేదా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తారా అనేది తెలియాలంటే మనం వేచి చూడాలి. ఇది కాకుండా, లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే చిత్రం ను చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు