కీ వస్తుంది పట్టించుకుంటారా ?

Published on May 9, 2019 2:14 pm IST

అప్పుడెప్పుడో రంగం తో తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో జీవా. అయితే ఆ తరువాత జీవా నటించిన సినిమాలు తెలుగులో విడుదలైన ఒక్కటి కూడా విజయాన్ని సాధించలేకపోయింది.

ఇక ఇప్పుడు చాలా రోజుల తరువాత ‘కీ’ అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులముందుకు రానున్నాడు జీవా. తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళం తోపాటు తెలుగు లో ఈనెల 11న విడుదలకానుంది. సైబర్ క్రైం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జీవా సరసన నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క పాత్ర‌లను పోషించారు. కలీస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

More