యాక్షన్ సీన్స్ పూర్తి చేసిన ‘కేజీఎఫ్ 2’ !

యాక్షన్ సీన్స్ పూర్తి చేసిన ‘కేజీఎఫ్ 2’ !

Published on Sep 20, 2019 1:21 AM IST

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కైకాల స‌త్య‌నారాయ‌ణ సమర్పిస్తున్నారు. కన్నడం, హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 శ‌ర‌వేగంగా తెరకెక్కుతుంది. అయితే ఇటీవలే కోలార్‌ గోల్డ్‌ మైన్స్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు షూటింగ్‌ వల్ల పర్యావరణానికి హానీ కలుగుతుందని షూటింగ్‌ ఆపేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత ఈ సినిమా షూటింగ్‌ ను హైదరాబాద్‌ కి షిఫ్ట్ చేసారు.

హైదరాబాద్‌ లో వేసిన భారీ సెట్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. ఇక తరువాత షెడ్యూల్ ను బెంగుళూరులో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో సినిమాని రిలీజ్‌ చేయ‌నున్నారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు