భారీ సెట్ లో కేజీఎఫ్ 2 షూటింగ్ !

Published on Sep 12, 2019 11:48 pm IST

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కైకాల స‌త్య‌నారాయ‌ణ సమర్పిస్తున్నారు. కన్నడం, హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 శ‌ర‌వేగంగా తెరకెక్కుతుంది. అయితే ఇటీవలే కోలార్‌ గోల్డ్‌ మైన్స్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు షూటింగ్‌ వల్ల పర్యావరణానికి హానీ కలుగుతుందని షూటింగ్‌ ఆపేసిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ను హైదరాబాద్‌ లో వేసిన భారీ సెట్ లో షూట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో సినిమాని రిలీజ్‌ చేయ‌నున్నారు అని తెలిపారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారు.

సంబంధిత సమాచారం :

X