రాజమౌళి మూలంగా ‘కెజిఎఫ్ 2’ పంట పండింది

Published on Feb 7, 2020 3:00 am IST

ఈ 2020లోనే ‘ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2’ విడుదలవుతాయని ఆయా చిత్ర నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. అలాగే రెండు సినిమాల విడుదలకు మధ్యన గ్యాప్ ఉండేలా చూసుకున్నారు కూడ. మొదట ‘కెజిఎఫ్ 2’ మే నెలలో వస్తుందని, ‘ఆర్ఆర్ఆర్’ జూలై 30న అని అన్నారు. కానీ రెండు సినిమాలు అనుకున్న సమయానికి విడుదలయ్యే పరిస్థితి లేదు.

మొదట మే నెలాఖరున రావాలనుకున్న ‘కెజిఎఫ్ 2’ టీమ్ కొద్దిగా వెనక్కి వెళ్ళాలనుకుంది. కానీ జూలై 30న ‘ఆర్ఆర్ఆర్’ ఉండటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇలా వారు డైలమాలో ఉండగానే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ను 2021 జనవరి 8కి వాయిదావేస్తూ కన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ జూలై 30వ తేదీనే కాదు 2020 డిసెంబర్ ముందువరకు ఎప్పుడైనా వచ్చే వీలు దొరికింది. మొత్తం మీద జక్కన్న డెసిషన్ ‘కెజిఎఫ్ 2’ బృందానికి మంచి ఊరటనిచ్చింది.

సంబంధిత సమాచారం :