‘కెజిఎఫ్ – 3’ : ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

‘కెజిఎఫ్ – 3’ : ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Published on Dec 7, 2023 1:25 AM IST


కన్నడ స్టార్ నటుడు యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ప్రతిష్టాత్మక సిరీస్ సినిమాలు అయిన కెజిఎఫ్ చాప్టర్ 1, 2 ఇటీవల రిలీజ్ అయి ఒక దానిని మించేలా మరొకటి అత్యద్భుతమైన సక్సెస్ లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీటికి సీక్వెల్ గా రానున్న కెజిఎఫ్ చాప్టర్ 3 ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎలా ఉండబోతోంది అనేటువంటి ఆసక్తి అందరిలో ఉంది.

ఇక తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ మూవీ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. కేజీఎఫ్ 3 అయితే తప్పకుండా వస్తుంది. మా వద్ద ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. కానీ దానికి నేను దర్శకుడినో కాదో నాకు తెలియదు, అయితే యష్ మాత్రం అందులో భాగమవుతారని తెలిపారు. హీరో యష్ ఒక చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి మరియు కేవలం వాణిజ్య కారణాల కోసం విషయాలను బయట పెట్టరని అన్నారు. నిజానికి కెజిఎఫ్ 2 ముగింపు సమయంలోనే తాము చాప్టర్ 3 స్క్రిప్ట్ కలిగి ఉన్నామని, దాని గురించి మాట్లాడాడనికి ఇంకా చాలా సమయం ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు