‘కెజిఎఫ్ 2’ విలన్ అధీరా వస్తున్నాడు…!

‘కెజిఎఫ్ 2’ విలన్ అధీరా వస్తున్నాడు…!

Published on Jul 26, 2019 11:54 AM IST

గత సంవత్సరం చివర్లో విడుదలైన ‘కెజిఎఫ్’ ఎంత సంచల విజయం సాధించిందో మాటల్లో చెప్పలేం. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హిందీతో పాటు,సౌత్ ఇండియా మొత్తం అన్ని భాషలలో విడుదలైన ‘కెజిఎఫ్’ అన్ని చోట్లా విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో నటించిన కన్నడ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

ఐతే ఈ మూవీకి కొనసాగింపుగా ‘కెజిఎఫ్ చాప్టర్2’ ని మొదటి భాగానికి మించి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మొదటి భాగాన్ని నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ ఈ భాగాన్ని కూడా నిర్మిస్తుంది. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో ప్రధాన ప్రతినాయకుడైన అధీరా లుక్ ని ఈనెల 29న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆయనే అధీరా పాత్ర చేసే అవకాశం కలదు. మొదటి భాగంలో విలన్ గరుడని ఒక రేంజ్ లో చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, అధీరాను అంతకు మించి చుపిస్తాడనడంలో సందేహం లేదు. ‘కెజిఎఫ్ 2’ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు