లాభాల్లో ‘ఖైదీ’.. ‘విజిల్’కు ఇంకా టైమ్ పడుతుంది

లాభాల్లో ‘ఖైదీ’.. ‘విజిల్’కు ఇంకా టైమ్ పడుతుంది

Published on Nov 1, 2019 11:40 AM IST

Khaidi whistle

దీపావళి సెలవుల్ని తమిళ సినిమాలు ‘ఖైదీ, విజిల్’ బాగా క్యాష్ చేసుకున్నాయి. పైగా సినిమాల్లో కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాయి. గత శుక్రవారం వచ్చిన ఈ రెండు సినిమాల్లో కార్తి యొక్క ‘ఖైదీ’ తొలిరోజు సాధారణమైన స్టార్ట్ మాత్రమే తెచ్చుకుంది. కానీ పాజిటివ్ టాక్ మూలాన సినిమా విపరీతంగా పుంజుకుని వారం గడిచేలోపే లాభాల్లోకి ప్రవేశించింది.

మొదటి వారంలో సినిమా రూ.4.8 కోట్ల షేర్ రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే రూ.4.3 కోట్లు. సో.. ఇప్పటికే లాభాలు మొదలయ్యాయి. ఇక విజయ్ యొక్క ‘విజిల్’ విశయనికొస్తే మొదటి నాలుగు రోజులు బాగా పెర్ఫార్మ్ చేసి ఆ తర్వాత నెమ్మదించింది. అయినా వారంలో రూ.9 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది.

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.10 కోట్లుగా ఉండటంతో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో కోటి రావాల్సి ఉంది. ఈ మొత్తం రావాలంటే ఇంకో నాలుగైదు రోజులైనా పడుతుంది.

తాజా వార్తలు