రవితేజకు ఫ్లాట్ అయిన విలన్

Published on Mar 2, 2021 11:15 pm IST

ఇటీవలే ‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ చేస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు అనూప్ సింగ్ ఠాకూర్ నటిస్తున్నారు. ఇటీవలే షెడ్యూల్లో పాల్గొన్న ఆయన రవితేజ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయారు. రవితేజగారు చాలా కలుపుగోలుగా ఉంటారన్న అనూప్ సింగ్ సెట్లో ఎప్పుడూ నవ్విస్తుంటారని, ఒక స్టార్ హీరోతో పనిచేస్తున్నామనే భావన రానివ్వరని, చాలా డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని, ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుందని చెప్పుకొచ్చారు.

రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను మే 28న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగులో విడుదలయ్యాక హిందీలో కూడ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ‘క్రాక్’ హిట్ కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో, బిజినెస్ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది కాకుండా తాజాగా త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ.

సంబంధిత సమాచారం :