మహేష్ బాబు హీరోయిన్ ప్రేమలో పడిందట !

Published on Aug 1, 2018 11:59 am IST

కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘భ‌ర‌త్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది కైరా అద్వానీ. ఒక్క సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ల‌స్ట్ స్టోరీస్‌ అనే వెబ్ సిరీస్‌ లో బోల్డ్ గా నటించి అక్కడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన విషయం హల చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే కైరా అద్వానీ బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో ప్రేమ‌లో పడిందని ఆ వార్త సారాంశం. కైరా అద్వానీ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా త‌ర‌చుగా బ‌య‌ట కనిపిస్తుండటం, కైరా పుట్టిన రోజు వేడుకకు సిద్ధార్థ్ ప్రత్యేకంగా హాజరు కావడంతో ప్రస్తుతం వీరిద్దరి గురించి ఈ గాసిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. మరి ఈ వార్త గురించి కైరా గాని, సిద్ధార్థ్ గాని ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More