రణవీర్ సింగ్‌తో రొమాన్స్ చేయనున్న కియారా అద్వానీ!

రణవీర్ సింగ్‌తో రొమాన్స్ చేయనున్న కియారా అద్వానీ!

Published on Feb 20, 2024 12:01 PM IST

సత్యప్రేమ్ కి కథలో చివరిగా కనిపించిన కియారా అద్వానీ, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. ఐకానిక్ డాన్ ఫ్రాంచైజీ యొక్క రాబోయే ఇన్‌స్టాల్‌మెంట్‌ డాన్ 3 లో కియారా లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఆమె టైటిల్ పాత్రను పోషించే రణవీర్ సింగ్‌తో స్క్రీన్‌ను పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం లో మరియు రితేష్ సిధ్వానీ మరియు ఫర్హాన్ అక్తర్ నిర్మాణం లో డాన్ 3 సినిమా ఉంటుంది.

శంకర్ ఎహసాన్ లాయ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే పుష్కర్, గాయత్రి మరియు ఫర్హాన్ అక్తర్ సహ రచయితలుగా ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025లో విడుదల కానున్న డాన్ 3 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు