ప‌హిల్వాన్‌ అంచనాలను అందుకుంటాడా ?

ప‌హిల్వాన్‌ అంచనాలను అందుకుంటాడా ?

Published on Aug 5, 2019 8:31 AM IST

‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ప‌హిల్వాన్‌. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ ప‌హిల్వాన్‌ అనే పేరుతోనే సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా పై సౌత్ అన్ని భాషల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి సుదీప్ ఆ అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.

ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ప‌హిల్వాన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. కె.జి.య‌ఫ్‌ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు ప‌హిల్వాన్‌ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు