
2009 లో కిక్కే ‘కిక్’ అంటూ తెలుగు ప్రేక్షకులను తెగ నవ్వించడమే కాకుండా తన కిక్కుతో తెలుగు ఆడియన్స్ ని థ్రిల్ చేసిన మాస్ మహారాజ్ రవితేజ 2015లో తన కంఫర్ట్ లెవల్స్ ఏంటో చూపించి ‘కిక్ 2’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తెగ నవ్వించడానికి సిద్దమయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు. అన్ని కార్యక్రమాలను సిద్దం చేసుకున్న ఈ కిక్ 2 సినిమా ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. నిన్నటితో డాల్బీ అట్మాస్ కార్యక్రమాలను కూడా ఫినిష్ చేసి ఈ సినిమా ఫస్ట్ కాపీని సిద్దం చేసారు. ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్దమవ్వడంతో సోమవారం లేదా మంగళవారం ఈ సినిమాని సెన్సార్ కి పంపనున్నారు.
సెన్సార్ నుంచి ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వస్తుందని ఈ చిత్ర టీం చాలా నమ్మకంగా ఉన్నారు.
రెండు వారాల ముందే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయడంతో ఈ చిత్ర టీం మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఆగష్టు 14న గ్రాండ్ గా కిక్2 ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా చేసారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన కామెడీ అండ్ యాక్షన్ ట్రైలర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా ఈ ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. కిక్ సినిమాలోని రవితేజ – ఇలియానాల కుమారుడు కథే ఈ ‘కిక్ 2’. కిక్ సినిమాకి సీక్వెల్ అయిన కిక్ 2 కి కూడా వక్కంతం వంశీ కథని అందించాడు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

