రవితేజ ‘కిక్ 2’ రిలీజ్ డేట్

రవితేజ ‘కిక్ 2’ రిలీజ్ డేట్

Published on Jul 24, 2015 2:00 PM IST

kick-2

మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రేజీ సినిమా సీక్వెల్ ‘కిక్ 2’. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఇప్పటి వరకూ పలు రిలీజ్ టైమ్స్ అనుకొని కుదరకపోవడంతో వెనక్కి వెళ్ళింది. దాంతో ఈ చిత్ర టీం ఇంకాస్త కేర్ తీసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని పర్ఫెక్ట్ గా పూర్తి చేయడమే కాకుండా కొన్ని అవసరం అయిన సీన్స్ ని రీ షూట్ కూడా చేసారు. తాజాగా ఈ చిత్ర టీంకి సంబందించిన సన్నిహితులు చెబుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘కిక్ 2’ సినిమాని ఆగష్టు 22న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

సురేందర్ రెడ్డి చాలా రోజులుగా ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నాడు. ముఖ్యంగా సిజి ఎఫెక్ట్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎక్కువ కేర్ తీసుకొని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేసారు. కిక్ సినిమాలో లానే కిక్ 2 లో కూడా ఆద్యంతం కామెడీ ఉంటూనే ఆడియన్స్ ని థ్రిల్ చేసే ట్విస్ట్ లు కూడా ఉంటాయని సమాచారం. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు