జూలై చివర్లో రవితేజ ‘కిక్ 2’.?

జూలై చివర్లో రవితేజ ‘కిక్ 2’.?

Published on Jun 15, 2015 7:07 PM IST

kick-2
మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రేజీ సినిమా సీక్వెల్ ‘కిక్ 2’. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మొదట మేలో రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ కుదరకపోవడంతో ఆ తర్వాత జూన్ అన్నారు. జూన్ నెల సగం అయిపోయినా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాకి సంబందించిన కొంతమంది సన్నిహితులు చెబుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ‘కిక్ 2’ని జూలైలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

అది కూడా జూలై చివరి వారంలో గ్రాండ్ గా కిక్ 2 ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పరంగా ఎక్కువ స్పెషల్ కేర్ తీసుకోవడం వలెనే రిలీజ్ ఆలస్యం అవుతోందని ఈ చిత్ర టీం అంటోంది. సిజి ఎఫెక్ట్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎక్కువ కేర్ తీసుకొని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తున్నారు. కిక్ సినిమాలో లానే కిక్ 2 లో కూడా ఆద్యంతం కామెడీ ఉంటూనే ఆడియన్స్ ని థ్రిల్ చేసే ట్విస్ట్ లు కూడా ఉంటాయని సమాచారం. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఎసెస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు