నైజాంలో భారీ ఎత్తున రిలీజ్ కానున్న ‘కిక్ 2’

నైజాంలో భారీ ఎత్తున రిలీజ్ కానున్న ‘కిక్ 2’

Published on Aug 18, 2015 7:10 PM IST

kick
తెలుగు సినీ పరిశ్రమలో ఒక హిట్ సినిమాకి సీక్వెల్ రావడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది దర్శకులు, హీరోలు తమ హిట్ సినిమాలకు సీక్వెల్స్ చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా 2009లో వచ్చి మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘కిక్’ కి సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘కిక్ 2’. మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డినే ఈ సినిమాకి కూడా దర్శకుడు. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న కిక్ 2 సినిమా ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

కిక్ 2 సినిమాని నైజాంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు, కిక్ 2 సినిమా నిజాం రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. నైజాంలో స్ట్రాంగ్ బేస్ ఉన్న దిల్ రాజు ఈ సినిమాని అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడమే కాకుండా మొదటి సారి రవితేజ సినిమాకి హైదరాబాద్ లో బెనిఫిట్ షో కూడా వేసేలా ప్లాన్ చేసాడు. దిల్ రాజు రవితేజ నటించిన పవర్ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఆ సినిమా 12 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. కిక్ 2 కి ఆ సినిమా కన్నా ఎక్కువ క్రేజ్ ఉండడం వలన ఈ సినిమాని దానికన్నా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. రవితేజ సారణ టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిచ్నఃనుంది.

టోటల్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో రేసుగుర్రం ఫేం రవి కిషన్, జిల్ ఫేం కబీర్ సింగ్ లు విలన్స్ గా కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు