
మాస్ మహారాజ్ టాలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కి సీక్వెల్స్ చేయచ్చు అని నిరూపిస్తూ చేసిన సినిమా ‘కిక్ 2’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చి సూపర్ హిట్ అయిన కిక్ సినిమాకి సీక్వెల్ ఇది. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కిక్ 2 సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు/ఏ’ అందుకున్న ఈ సినిమా ఆగష్టు 21న అత్యధిక థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రింట్ వర్క్స్ మరియు వాటి డిస్పాచ్ కి సంబందించిన వర్క్స్ జరుగుతున్నాయి.
ఈ సినిమా ఇరు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారని ఇదివరకే తెలియజేశాం. ఒక్క లోకల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మాకు యుఎస్ నుంచి అందిన సమాచారం ప్రకారం సుమారు 90 నుంచో 100 లొకేషన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. అలాగే మేజర్ లొకేషన్స్ లో గురువారం సాయంత్రం ప్రీమియర్స్ కూడా వెయ్యనున్నారు. రవితేజ కెరీర్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో హై డోస్ కామెడీ ఉండడం వలన ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.
రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పండిట్ రవితేజగా బ్రహ్మానందం నవ్వించనున్నాడు. టోటల్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రేసుగుర్రం ఫేం రవి కిషన్, జిల్ ఫేం కబీర్ సింగ్ లు విలన్స్ గా కనిపించనున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు.

