
‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’.. ఈ రెండు సినిమాలూ తెలుగు సినిమా బాక్సాఫీస్ సత్తాను చాటడమే కాకుండా డాల్బీ అట్మాస్ అనే సౌండ్ సిస్టమ్‌కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. 2012లోనే ఇండియన్ సినిమాకు ఈ సౌండ్ సిస్టమ్ పరిచయమైనా, ఆ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ అయిన థియేటర్లు ఇప్పటికీ చాలా తక్కువే! అయితే ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ ఇలా కొత్త సినిమాలన్నీ ఈ సిస్టమ్‌తో అలరించేందుకు సిద్ధమైపోవడంతో ప్రస్తుతం ఈ సిస్టమ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన మల్టిప్లెక్స్‌లతో పాటు కొన్ని సింగిల్ స్క్రీన్స్ కూడా డాల్బీ అట్మాస్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ అవుతున్నాయి.
ఇక రెండు వరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు సినిమాకు ఆ జోరును రెట్టింపు చేస్తుందన్న అంచనాలతో ‘కిక్ 2’ ఈ వారమే విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కూడా బాహుబలి, శ్రీమంతుడు బాటలోనే డాల్బీ అట్మాస్ సిస్టమ్‌తో అలరించనుంది. రవితేజ-సురేందర్ రెడ్డిల కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ ‘కిక్’కు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందింది. కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి. థమన్ అందించిన ఆల్బమ్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. డాల్బీ అట్మాస్ సిస్టమ్‌లో ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంటుందని టెక్నికల్ టీమ్ చెబుతోంది.

