‘కిక్ 2’ ఫస్ట్‌డే నైజాం కలెక్షన్స్!

‘కిక్ 2’ ఫస్ట్‌డే నైజాం కలెక్షన్స్!

Published on Aug 22, 2015 6:12 PM IST

kick
రవితేజ కెరీర్లో మరిచిపోలేని హిట్‌గా నిలిచిన ‘కిక్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సినిమాయే ‘కిక్ 2’. గత రెండు నెలలుగా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులను ఆలోచనల్లోకి నెట్టేసిన ఈ సినిమా, చివరకు భారీ అంచనాల మధ్య పెద్ద ఎత్తున నిన్న విడుదలైంది. రేసు గుర్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడం, కిక్ లాంటి బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా రావడం, హీరో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందండడం వంటి అంశాలతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఇక థమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఆడియో కూడా సూపర్ హిట్ కావడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. కిక్ 2 సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఇక మొదటిరోజు అన్నిచోట్లా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నైజాం ఏరియాలో ‘కిక్ 2’ మొదటి రోజు 2 కోట్ల 63 లక్షల షేర్ వసూలు చేసింది. సురేందర్ స్టైల్ టేకింగ్, రవి తేజ మార్క్ యాక్టింగ్, కిక్కిచ్చే ఫస్టాఫ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. రవి తేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు