వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ ఇంటెన్స్ ఫస్ట్‌లుక్!

వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ ఇంటెన్స్ ఫస్ట్‌లుక్!

Published on Apr 24, 2015 8:55 AM IST

Killing-virapan
ఒకప్పుడు దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన స్థాయికి తగ్గ సినిమా ఒక్కటీ చేయట్లేదు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఏదో ఒక రోజు తమ అభిమాన దర్శకుడు ఓ గొప్ప సినిమా తీస్తే చూడాలన్న ఆశ మాత్రం వదులుకోలేదు. ప్రయోగాలు, జీవితానికి దగ్గరగా ఉండే కథలంటే వర్మకు విపరీతమైన ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ముంబై మాఫియా, గ్యాంగ్‌స్టర్ సినిమాలను ఎక్కువగా చేశాడు. తాజాగా మరో రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించే పనిలో పడ్డాడు వర్మ.

వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు. ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు. అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్’గా వర్మ తెలిపాడు.

ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రామ్ గోపాల్ వర్మ ఈ ఉదయం విడుదల చేశారు. శివరాజ్‌ కుమార్ ఇంటెన్స్ లుక్ ఈ పోస్టర్‌కు మంచి లుక్ తెచ్చిపెట్టింది. సినిమా అద్భుతంగా రూపొందనుందని ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని వర్మ ఈ సందర్భంగా తెలిపాడు.

తాజా వార్తలు