వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ రిలీజ్ డేట్

Killing-Veerappn
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కిల్లింగ్ వీరప్పన్ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ వచ్చింది. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఆడియోలతో ఈ సినిమా సినీ అభిమానుల్లో మంచి అంచనాలను రేకెత్తించింది.

ఇక ఇప్పటివరకూ ఈ సినిమా నవంబర్ నెలాఖరు, డిసెంబర్ మొదటి వారం అంటూ ప్రచారం పొందిందే తప్ప సరైన రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కాగా తాజాగా ఈ ఉదయం రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను డిసెంబర్ 4వ తేదీన కన్నడ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నటు ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మొదటి కన్నడ సినిమా కావడం కూడా కిల్లింగ్ వీరప్పన్‌కు ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. అన్ని భాషల్లో కలిపి సుమారు 2000 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.

Exit mobile version