వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ కొత్త ట్రైలర్ రిలీజ్ డేట్

Killing-Veerappn

ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉండే ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో వివాదాస్పద నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమాతో మనముందుకు రానున్న విషయం తెలిసిందే! దక్షిణ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరుగాంచిన వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకొని వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది.

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో నటించారు. వీరప్పన్‌ను చంపిన ఓ పోలీస్ కథగా ఈ సినిమా రూపొందింది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేయగా, తాజాగా మరో కొత్త ట్రైలర్‌తో మెప్పించేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధమయ్యారు. అక్టోబర్ 18న రాత్రి 10:40కి కిల్లింగ్ వీరప్పన్ రెండో ట్ర్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 18వ తేదీన వీరప్పన్ పోలీసుల కాల్పుల్లో చనిపోవడం ట్రైలర్‌ రిలీజ్‌ను అదే రోజు చేపట్టడానికి ప్రత్యేక కారణంగా వర్మ తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లిల్లోని పలు రియలిస్టిక్ లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి నవంబర్ నెలలో విడుదల కానుంది.

Exit mobile version