బిగ్ బాస్ 4 – నాగ్ ఈ విషయంలో నిరాశగా ఉన్నారా?

Published on Nov 26, 2020 7:02 am IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలి హోస్టింగ్ తో అదిరిపోయే క్రేజ్ ను రాబట్టుకున్న కింగ్ నాగార్జున ముందు “మీలో ఎవరు కోటీశ్వరుడు” తో స్మాల్ స్క్రీన్ వీక్షకులకు మరింత దగ్గరయ్యి తర్వాత బిగ్ బాస్ సీజన్ 3కు హోస్ట్ గా వచ్చి సెన్సేషన్ నే సృష్టించారు. ఇక ఆలాగే ఈసారి ప్లాన్ చేసిన సీజన్ 4 కు కూడా ఆయన్నే హోస్ట్ గా తీసుకోవడంతో మరింత రెస్పాన్స్ ఇదే ఊపులో వచ్చింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈసారి సీజన్ విషయంలో నాగ్ ఒకింత నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. అదే ఈ షో సీక్రెట్స్ విషయంలో. వీకెండ్స్ లో ఎంతో కీలకమైన ఎలిమినేషన్స్ అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కు సంబంధించి ముందే వచ్చేస్తున్న లీకులపై నాగ్ దృష్టి పడినట్టు తెలుస్తుంది. ఇవేవి తనకు నచ్చలేదట. ముందుగానే ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని మేకర్స్ కు సూచనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More