మరో భారీ కాంబినేషన్ కి ఓకే చెప్పిన కింగ్ నాగ్?

మరో భారీ కాంబినేషన్ కి ఓకే చెప్పిన కింగ్ నాగ్?

Published on Apr 21, 2024 8:00 AM IST

మన టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “నా సామిరంగ” తో మళ్ళీ తాను ట్రాక్ లోకి వచ్చేయగా ఈ సినిమా తర్వాత నాగార్జున మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. అయితే నాగార్జున (Nagarjun) హీరోగా మాత్రమే కాకుండా పలు భారీ చిత్రాల్లో గెస్ట్ లేదా క్యామియో పాత్రల్లో కూడా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఇలా బాలీవుడ్ నుంచి భారీ సినిమా “బ్రహ్మాస్త్ర” (Brahmastra Movie) ఇప్పుడు ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ “కుబేర” (Dhanush Kubera) లో కూడా తాను కనిపించనున్నారు. అయితే వీటితో పాటుగా మరో భారీ కాంబినేషన్ కి కింగ్ ఓకే చెప్పినట్టుగా తమిళ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.

దీని ప్రకారం సౌత్ ఇండియా దగ్గర కేజ్రీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల సినిమాలో (Thalaivar 171) అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం సాలిడ్ ట్రీట్ ఆడియెన్స్ కి ఉంటుంది అని చెప్పాలి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు