లాక్ డౌన్ రివ్యూ : ‘కింగ్‌డమ్’ – సీజన్ 1, మరియు సీజన్ 2 (నెట్ ఫ్లిక్స్ )

లాక్ డౌన్ రివ్యూ : ‘కింగ్‌డమ్’ – సీజన్ 1, మరియు సీజన్ 2 (నెట్ ఫ్లిక్స్ )

Published on Apr 26, 2020 6:44 PM IST


 

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన వెబ్ సిరీస్.. కొరియన్ వెబ్ సిరీస్ ‘కింగ్‌డమ్’. ఈ వెబ్ ధారావాహికకు కిమ్ సియాంగ్-హున్ దర్శకత్వం వహించారు. పీరియాడిక్ హర్రర్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

ఈ కథా నేపథ్యానికి వస్తే 17 వ శతాబ్దం ప్రారంభంలో, కింగ్డమ్ క్రౌన్ ప్రిన్స్ లీ చాంగ్ జీవితమే కథా గమనం. వివిధ అంతర్గత మరియు బాహ్య సంఘర్షణల నుండి తన రాజ్యాన్ని కాపాడటానికి లీ చాంగ్ చేసిన వివిధ ప్రయత్నాలు ఏమిటీ ? ఈ క్రమంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనలు ఏమిటి ? యువరాజు తన తండ్రి బాధపడుతున్న వ్యాధి గురించి మరింత తెలుసుకోవడానికి అతను చేసే సాహసోపేతమైన ప్రయాణం ఏమిటి ? అసలు తన రాజ్యంలో రాజకీయ కుట్రలు మాత్రమే కాకుండా, ప్రజలను జాంబీస్‌గా మార్చే ఒక మర్మమైన ప్లేగు కూడా ఉందని, ఇవ్వన్ని తన రాజ్యాన్ని ఎలా నాశనం చేయబోతాయి.? దాంతో లీ చాంగ్ రాజ్యం కోసం చేసిన పనులు ఏమిటి అనేదే మిగతా కథా గమనం.

 

విశ్లేషణ:

దుష్ట రాజుల ఆలోచనా విధానాలతో రాజకీయ కుట్రల సంఘటనల క్రమంగా సాగే డ్రామా మరియు కొన్ని సందర్భాల్లో భయానక శైలి లో సాగే ప్యాలెస్ రాజకీయాల అన్వేషనే ఈ కింగ్డమ్. యువరాజు ప్యాలెస్ నుండి బయలుదేరిన వెంటనే, అతన్ని ప్రత్యర్థి వంశం దేశద్రోహిగా ప్రకటిస్తుంది. దాంతో యువరాజు ప్రాణానికే ముప్పు వాటిళ్లుతుంది. ఈ క్రమంలో జరిగే నాటకీయ సంఘటనలు బాగుంటాయి. రాజధానికి దూరంగా ఉన్న చిన్న రాష్ట్రాల నమ్మకం మరియు మద్దతు సంపాదించడం తప్ప వేరే మార్గం లేని సంఘటన కూడా ఆకట్టుకుంటుంది. నమ్మకమైన బాడీగార్డ్ ము-యోంగ్ మద్దతు ఇవ్వడం కూడా హీరోయిజమ్ గా అనిపిస్తోంది. అదేవిధంగా జోంబీ దాడి యొక్క తెలివైన సంఘటనలను పరిగణనలోకి తీసుకుని కచ్చితంగా మెచ్చుకోవాలి. ఇక ఈ ధారావాహికకు మొదటి నుంచీ ఆదరణ కలగడానికి కారణం మాత్రం కథలో ఉద్రిక్తత మరియు ఎమోషనల్ డ్రామా బాగుండటమే. ఈ ధారావాహికలోని కొన్ని ఉత్తమ విభాగాలలో రోజురోజుకు పెరుగుతున్న జాంబీస్ సంఖ్యతో మనుగడ కోసం కష్టపడుతున్న ప్రధాన పాత్రల తీరు కూడా బాగా ఆకట్టుకుంటుంది. పైగా కథలోని టెన్షన్ పెంచే భయానక అంశం ఎప్పుడూ తగ్గదు. అలాగే ప్యాలెస్ రాజకీయాలు కూడా సమర్థవంతంగా నిర్వహించబడతాయి. మొత్తంగా ఇది ఆసక్తికరమైన ఎమోషనల్ డ్రామా.

 

ఏం బాగుంది ?

టేకింగ్ తో పాటు నటీనటుల ప్రదర్శన మరియు కథ యొక్క సంఘటనల గమనం భారతీయ డ్రామాకి మంచి సారూప్యతలను కలిగి ఉండటం బాగున్నాయి. ముఖ్యంగా సింహాసనం కోసం జరిగే నాటకీయ పరిణామాలు చాల బాగున్నాయి. ఇక కొంతమంది ఔత్సాహికులు లీ చాంగ్ మరియు ము-యోంగ్ యొక్క సాహసాలను బాహుబలిలోని బాహుబలి మరియు కట్టప్పలతో పోల్చారు, అలాగే వారిద్దరూ పంచుకునే స్నేహం మరియు బంధం కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి షోల ప్రభావం ఎక్కువ ఉందని అనిపిస్తోంది. కానీ ప్రత్యేకించి నటన మరియు రచనల విషయానికి వస్తే. కింగ్డమ్ మంచి స్కోరే చేస్తోంది.

 

చివరి మాటగా:

ప్రస్తుతం కరోనా వైరస్ వివిధ దేశాలలో వివిధ ప్రాంతాలలో ఎలా వ్యాపించిందో.. స్థానిక ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని ఆపడానికి ఏమి చేస్తున్నాయో ఇలా నేటి సమాజాన్ని గుర్తుచేసే కొన్ని అంశాలు ఈ కింగ్‌డమ్‌లో ఉన్నాయి. ఇక కథలో సాంఘిక-రాజకీయ వ్యాఖ్యానాన్ని పక్కన పెడితే.. కథలోని మెయిన్ ఎమోషన్ పేదలు ఎల్లప్పుడూ యుద్ధంతో వ్యాధులతో కన్నీళ్ల భారాన్ని ఎలా భరిస్తారనే దాని గురించి, కింగ్డమ్ లో చాల బాగా చూపించారు. ఇక ప్రజలను రక్షించడానికి ఒక యువరాజు చేసే ధైర్య సాహసాల ప్రయత్నంతో సాగే కథాకథనాలతో ఈ సిరీస్ గొప్ప సంతృప్తికరమైనదిగా నిలుస్తోంది.

సీజన్ 1 మరియు సీజన్ 2 ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్నాయి.

 

 

123telugu.com Rating : 4/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు