కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న కిరణ్ అబ్బవరం..!

కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న కిరణ్ అబ్బవరం..!

Published on Jun 12, 2026 12:03 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న 13వ చిత్రానికి ‘KA13’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. కిరణ్ అబ్బవరం కేవలం హీరోగానే కాకుండా, ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలను కూడా స్వయంగా ఆయనే చేపట్టడం విశేషం. దర్శకుడిగా ఆయనకు ఇది సరికొత్త ప్రయాణం కానుంది.

జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక లాడ్జ్ లేదా హోటల్ రిసెప్షన్ డెస్క్‌పై ఉండే బెల్‌ను నొక్కుతున్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, కిరణ్ అబ్బవరం ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో మన ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు