కిరణ్ అబ్బవరం, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ సినిమా

Kiran Abbuvaram

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment), జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్‌తో చేతులు కలిపారు. వీరు కిరణ్ హీరోగా ఓ భారీ ‘పాన్-ఇండియా’ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఒక అద్భుతమైన ‘మైథాలజీ యాక్షన్ ఎంటర్‌టైనర్’గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వరల్డ్ క్లాస్ ‘విజువల్స్’, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను నిర్మించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే సెప్టెంబర్ నెలలో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

హీరోయిన్ ఎంపిక విషయంలోనూ చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. బాలీవుడ్ లేదా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమా టైటిల్, డైరెక్టర్, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. భక్తి, ఎమోషన్స్, డ్రామా, మరియు హై-వోల్టేజ్ యాక్షన్‌ కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం.. అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

Exit mobile version