
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బరం చేస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. ప్రస్తుతం డబ్బింగ్ స్థాయిలో ఉంది ఈ చిత్రం. మే నెలలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈ సినిమా హక్కుల్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరగంల్ శ్రీను దక్కించుకున్నారు. ఈ సినిమా కాకుండా కిరణ్ ఇంకో రెండు సినిమాలు చేస్తున్నారు. ‘సెబాస్టియన్, సమ్మతమే’ చిత్రాలు సెట్స్ మీదున్నాయి. త్వరలోనే వీటి షూటింగ్ కూడ ముగియనుంది.
ఈ రెండు చిత్రాల తర్వాత ఇంకో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు కిరణ్. వీటిలో ఒక చిత్రం పెద్ద బడ్జెట్ చిత్రం. విడుదలైంది కేవలం ఒకే ఒక్క సినిమానే అయినా కిరణ్ అబ్బవరం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. తక్కువ సమయంలో షూటింగ్స్ చేయడమే కిరణ్ దగ్గరున్న ఫ్లెక్సిబిలిటీ అంటున్నారు. అందుకే కొత్త దర్శకులు, చిన్న బడ్జెట్ నిర్మాతలు కిరణ్ అబ్బవరంను అప్రోచ్ అవుతున్నారు. కిరణ్ సైతం కథ బాగుంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.