భారీ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మెగా హీరో చేతిలో ఆ మాసివ్ సినిమా..!

మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు జెనరేషన్ హీరోలు అయినా అప్పటి జెనరేషన్ హీరోలు అయినా ఒకరితో అనుకోని మరో హీరో వద్దకి వెళ్లిన సినిమాలు కోకొల్లలు అలానే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఓ భారీ ప్రాజెక్ట్ ని మిస్ చేసుకున్నట్టు తాను తెలిపాడు. అది కూడా ఏకంగా 100 కోట్ల బిగ్ బడ్జెట్ సినిమా అట. ఇప్పుడు ఆ సినిమా ఓ మెగా హీరో చేస్తున్నాడు.

ఇంతకీ ఆ సినిమా ఏదంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మాసివ్ స్కేల్ ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా అట. దర్శకుడు రోహిత్ తనకి తన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా సమయంలోనే పరిచయం అయ్యాడని అతను చాలా మంచి మనిషి, అలా సినిమా డిస్కషన్ లో ముందు ఓ రెండు కోట్లలో అయిపోయే చిన్న సినిమా కథ అది అని తెలిపాడు.

కానీ తాను కొంచెం పెద్ద స్కేల్ ఉన్న కథ అడిగితే అప్పుడు సంబరాల ఏటి గట్టు సబ్జెక్టు తీసుకొచ్చాడని, కాకపోతే అప్పుడు తన సినిమాలు ప్లాప్స్ లో ఉండడం ఆ సినిమా బడ్జెట్ అంతకంతకూ 70, 80 కోట్ల వరకు పెరుగుతూ వెళ్లడంతో నేనే నా మార్కెట్ కి వద్దు అని చెప్పేసానని తెలిపాడు.

నిర్మాత నిరంజన్ అన్న తనతో చేద్దామనే చెప్పినప్పటికీ ఆ ప్రాజెక్ట్ తనతో వద్దని చెప్పేసానని కానీ అది సాయి ధరమ్ తేజ్ అన్న వద్దకు వెళ్లడంతో హ్యాపీ అనిపించింది అన్ని కిరణ్ తెలిపాడు. సో అలా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ప్రాజెక్ట్ ని తాను మిస్ చేసుకున్నాడని చెప్పాలి.

Exit mobile version