ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న “రూల్స్ రంజన్”..!

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న “రూల్స్ రంజన్”..!

Published on Nov 29, 2023 4:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు రతినం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా ఈ సినిమా థియేట్రికల్ గా అయితే ఫెయిల్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమా ఓటీటీ పార్టనర్ గా మన తెలుగు స్ట్రీమింగ్ సంస్థ ఆహా వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా ఫైనల్ గా చిత్రం నవంబర్ 30న స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఇక ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతం అందించగా స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా ఏ ఎం రత్నం సమర్పణలో సినిమా రిలీజ్ చేశారు. మరి ఈ సారి సినిమా చూడాలి అనుకునేవారు ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు